నెక్స్ట్ ఏంటి ?

Thursday,January 19,2017 - 05:42 by Z_CLU

లేటెస్ట్ గా మెగా స్టార్ రి ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో గ్రాండ్ హిట్ అందుకున్న స్టార్ డైరెక్టర్ వినాయక్ నెక్స్ట్ ఏ హీరో తో సినిమా చేయబోతున్నాడు? అనే ప్రశ్న ప్రెజెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవలే ఓ పెద్ద స్టార్ హీరోతోనే నెక్స్ట్ సినిమా ఉండబోతుందంటూ వినాయక్ చెప్పడం తో ఆ హీరో ఎవరా? అనే ఆరాలు ఇండస్ట్రీ లో మొదలయ్యాయి. మరి ఈ స్టార్ డైరెక్టర్ డైరెక్ట్ చేయబోయే ఆ స్థార్ హీరో ఎవరా? అంటే లిస్ట్ లో ప్రెజెంట్ ఓ నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి.

అందులో మొదటి పేరు నటసింహం బాలకృష్ణ దే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘చెన్నకేశవ రెడ్డి’ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటి గ్రాండ్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. అందుకే తన 101 సినిమాను వినాయక్ తో చెయ్యాలని చూస్తున్నాడట బాలయ్య. ఇక కృష్ణవంశీ బాలకృష్ణ కాంబినేషన్ లో ‘రైతు’ సినిమా వెనక్కి వెళ్లడం తో బాలయ్య వినాయక్ కె ఓటేసాడనే టాక్ వినిపిస్తుంది. ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో నెక్స్ట్ సినిమా చేయబోతున్న తారక్ వినాయక్ తో ఎప్పటి నుంచో ‘అదుర్స్’ కి సీక్వెల్ చెయ్యాలని చూస్తున్నాడు. అంటే బాబీ సినిమాతో పాటే వినాయక్ కి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఇవ్వొచ్చని టాక్. ఇక వినాయక్ చేయబోయే నెక్స్ట్ సినిమా లిస్ట్ లో బాబాయ్ అబ్బాయి తో పాటు విక్టరీ వెంకటేష్ పేరు కూడా వినిపిస్తుంది. గతం లో ‘లక్ష్మి’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వీరిద్దరూ మళ్ళీ అలాంటి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నారనే వార్త కూడా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.వీరి తో పాటు మరికొందరు స్టార్ హీరోల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఏ హీరో తో వినాయక్ సెట్స్ పైకి వెళ్తాడో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే …