వినాయక్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Tuesday,January 10,2017 - 07:08 by Z_CLU

మాస్ యాక్షన్ సినిమాల  స్పెషలిస్ట్ వి.వి.వినాయక్ మెగాస్టార్ చిరుతో ‘ఖైదీ నంబర్ 150 ‘ సినిమాను తెరకెక్కించాడు. సంక్రాంతి కానుకగా ముస్తాబైన ఈ సినిమా గురించి వినాయక్ చాలా విశేషాలు చెప్పుకొచ్చాడు…

*దాదాపు 50  కథలు విన్నారు

ఈ సినిమా ఫైనల్ చేయకముందు చిరంజీవి గారు దాదాపు 50  కథలు విన్నారు. ఫైనల్ గా తమిళ్ లో తెరకెక్కిన ‘కత్తి’ సినిమాను చూసి అన్ని ఎలిమెంట్స్ ఉండడంతో ఆ కథను సెలెక్ట్ చేసుకొని మా చేతిలో పెట్టారు.

*ఆ సినిమాయే గుర్తొచ్చింది….

చిరంజీవి గారితో ‘కత్తి’ రీమేక్ అనగానే  నాకు వెంటనే ఆయన నటించిన ‘రౌడీ అల్లుడు’ సినిమానే గుర్తొచ్చింది.  కారణం ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ చేయడమే. ఈ సినిమా స్క్రీన్ ప్లే వర్క్ జరుగుతున్నప్పుడు  ఆ సినిమాలోని ఆటో జానీ, కళ్యాణ్ క్యారెక్టర్స్ ను ఊహించుకొనే వర్క్ చేశాం. ఎందుకంటే ఈ సినిమాలో క్యారెక్టర్స్ కూడా ఆల్ మోస్ట్ రౌడీ అల్లుడు క్యారెక్టర్స్ లానే ఉంటాయి.

*ఈ అవకాశం ఆ డైరెక్టర్ వల్లే వచ్చింది

ఈ సినిమా విషయంలో నేను ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాల్సిన ఓ డైరెక్టర్ ఉన్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన గురించి చెప్పాలనుకున్నా కానీ కుదరలేదు. అందుకే చాలా మాట్లాడాలని  ఉంది మాట్లాడలేకపోతున్నా అక్కడ కుదరకపోవడం వల్ల త్వరగా ముగించేశా. ఆ డైరెక్టర్ ఎవరో కాదు మురుగదాస్. ఇంతగొప్ప  కథను డైరెక్ట్ చేసే అవకాశం పైగా మెగాస్టార్ తో తెరకెక్కించే అవకాశం మురుగదాస్ వల్లే నాకు వచ్చింది. అందుకే మురుగదాస్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

*ఆ స్థాయికి తగ్గదు

గతంలో మా కాంబినేషన్ లో వచ్చిన ‘ఠాగూర్’ గ్రాండ్ హిట్ గా నిలిచింది. డెఫినెట్ గా ఈ సినిమా ఆ సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఎంటర్టైన్ చేస్తుంది.

*నా మైండ్ లో ఆ ఇద్దరే..

ఈ సినిమాలో చిరంజీవి గారి పక్కన హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అనే టైంలో నా మైండ్ లో అనుష్క, కాజల్ ఇద్దరే మైండ్ లో ఉన్నారు. అనుష్క డేట్స్ కుదరకపోవడం వల్ల కాజల్ ను ఫైనల్ చేశాం. ఇద్దరి పెయిర్ బాగా కుదిరింది. సినిమాలో చిరంజీవి – కాజల్  మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తాయి.

*టెన్షన్ అస్సలు లేదు

రిలీజ్ దగ్గర పడింది కదా టెన్షన్ ఫీలవుతున్నారా అని అందరూ అడుగుతున్నారు. ఎందుకో తెలియదు అస్సలు టెన్షన్ లేదు. సినిమా రిలీజ్ అయి గ్రాండ్ హిట్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. దానికి కారణం చిరంజీవి గారు. ఫైనల్ అవుట్ ఫుట్ చూసి నన్ను కౌగిలించుకొని సంతోషంగా ఫీలయ్యారు.

*ఆశ్చర్య పోయాను

చిరంజీవి గారు  ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆయన చేతికి  ఏదో సర్జరీ అయ్యింది. నేను ఇంటికి వెళ్లే సరికి ఆయన కూర్చొని ఇంకో చేతి తో డంబెల్స్ తో ఎక్సర్ సైజ్ చేస్తున్నారు. అంతకసితో మళ్ళీ స్క్రీన్ మీద ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలని డిసైడ్ అయ్యి ఓ పట్టుదల తో ఈ సినిమా చేసారు.

*దానికి కారణం అదే

చిరంజీవి 150 అనగానే చాలా మంది రైటర్స్ నన్ను కలిసి ఫోర్స్ చేశారు. అందుకే పరుచూరి బ్రదర్స్ కి పరిస్థితి చెప్పి వాళ్ళు కూడా సరే అంటే మరో ఇద్దరు రైటర్స్ ను తీసుకున్నాం. కొన్ని సీరియస్ డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా గారు రాశారు. ఇక కామెడీ సీన్స్, బ్రహ్మానందం ట్రాక్ వేమా రెడ్డి రాశారు. మిగతా పవర్ ఫుల్ డైలాగ్స్ అన్నీ పరుచూరి బ్రదర్స్ రాశారు. సత్యానంద్ గారు కూడా స్క్రిప్ట్ విషయంలో సహకారం అందించారు.

*కొన్ని మార్పులే చేశాం

ఒరిజినల్ కి ఈ సినిమాకు కొన్ని మార్పులు చేశాం. కథ ను మార్చకుండా చిరంజీవికి కావాల్సిన ఎలిమెంట్స్ కొన్ని యాడ్ చేశాం. కామెడీ, పాటలు సిట్యుయేషన్స్ లో కొన్ని మార్పులు చేశాం.

* మూడో షేడ్ చూడొచ్చు

ఈ సినిమాలో పోకిరిగా అల్లరిచిల్లరిగా కేర్ లెస్ గా ఉండే ఓ క్యారెక్టర్ సడెన్ గా ఓ మంచి కోసం చేంజ్ అయ్యే సీన్ లో చిరంజీవి గారి థర్డ్ షేడ్ కనిపిస్తుంది. ఇంటర్వెల్ లో వచ్చే ఆ సీన్ సినిమాకు హైలైట్.

*కొంత కాలం ఆ  డిప్రెషన్ లో ఉన్నా

అఖిల్ సినిమా రిజల్ట్ కి కొంత డిప్రెషన్ లో ఉన్నాను. అందులో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చింది చిరంజీవి గారే.

* ఆ సినిమాలో ఉండవు

ఒరిజినల్ లో లేని కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశాం. ఆ సినిమాలో ఐటెం సాంగ్ లేదు. మనం యాడ్ చేశాం. అలాగే కామెడీ సీన్స్ కొన్ని లేవు. అవి కూడా యాడ్ చేయడం జరిగింది.

*దేవిశ్రీ ఆ స్థాయిలో ఇచ్చాడు

ఈ సినిమాకు అదిరిపోయే డ్యూయెట్ సాంగ్స్ తో పాటు ‘నీరు నీరు’ అనే సాంగ్ అందించి ఇళయరాజా, కీరవాణి గారి స్థాయిలో ఆ సాంగ్ ను కంపోజ్  చేశాడు దేవి. నిజంగా ఆ విషయంలో దేవిశ్రీకి  హాట్సాఫ్  చెప్పాల్సిందే. ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

*పవన్ లేరు

ఈ సినిమాలో అమ్మడు కుమ్ముడు అనే సాంగ్ లో చరణ్ కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు లేరు.

*మళ్ళీ పృథ్వి  సీన్ యాడ్ చేశాం 

చిరంజీవి గారు రీఎంట్రీ ఇస్తున్న 150 సినిమా కావడంతో చాలామంది ఆర్టిస్టులు ఉత్సాహపడ్డారు. అయితే పృథ్విగారు కూడా మిస్టర్ గా  ఓ కామెడీ క్యారెక్టర్ చేశారు. కానీ లెంగ్త వల్ల ఆయన నటించిన 40 సెకెన్ల సీన్ తీసేశాం. అయితే నేనే ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ లెంగ్త వల్ల సీన్స్ తీసేశాం అని చెప్పాను. కానీ తర్వాత అమ్మ చనిపోయినంత బాధగా ఉంది అనిపెట్టారు. వెంటనే చిరంజీవి గారు కూడా ఫీల్ అయ్యి పండగకి ఆయనను బాధపెట్టడం ఎందుకని చెప్పి మర్యాద ఇచ్చి యాడ్ చేయమని చెప్పారు. వెంటనే ఆ 40 సెకెన్లు  మళ్ళీ పెట్టాం

*చిరంజీవి గారు బ్రహ్మానందం కావాలన్నారు.

చిరంజీవి గారికి బ్రహ్మానందం అంటే చాలా ఇష్టం. ఆయన బ్రహ్మానందం కావాలి అని అడిగారు. వెంటనే ఆయన కోసం వేమారెడ్డి తో ఓ ట్రాక్ రాయించి కాయిన్ ఫైట్ లో కాస్త కామెడీ చేర్చాం. బ్రహ్మానందం గారు సినిమాకు ప్లస్ అయ్యారు

*సంబంధం లేని ఎంతో మంది

చిరంజీవి గారు రీఎంట్రీ ఇస్తున్నారనగానే ఆర్టిస్టుల సంగతి అటుంచి సినిమాకు సంబంధం లేని ఎంతోమంది పెద్ద  ఆఫీసర్స్ తో ఫోన్ చేయించారు. ఇక ఫ్రెష్ గా కొంత మంది 300  మంది ని ఆడిషన్స్ చేసి అందులోంచి ఓ 30  మందిని ఫైనల్ చేసి కొన్ని సీన్స్ లో నటింపజేశాం.

*ఆ ఐడియా దేవి  ఇచ్చాడు

సినిమాలో ఓ సాంగ్ కి ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని మ్యూజిక్ ఇచ్చాడు దేవి. ఆ మ్యూజిక్ మాకు బాగా నచ్చి అదే టాగ్ లైన్ గా పెట్టడం జరిగింది. నిజంగా ఆ ఐడియా మాకు ఇచ్చింది దేవిశ్రీనే.

*ఒక పెద్ద హీరో తో …..

నెక్స్ట్ ఓ పెద్ద  హీరో తో సినిమా ప్లాన్ చేస్తున్నా. ఆ సినిమా కథ సెట్ అవ్వగానే డీటెయిల్స్ చెబుతా…