‘ఇస్మార్ట్ శంకర్’ లో యాక్షన్ జోన్ వీళ్ళదే...

Friday,June 21,2019 - 12:07 by Z_CLU

ఇప్పటి దాకా ఈ ‘ఇస్మార్ట్ శంకర్’ నుండి రామ్ క్యారెక్టర్ తప్ప పెద్దగా ఏదీ రివీల్ కాలేదు. సినిమాలో ఎగ్జైటెడ్ చేయబోయే ఎలిమెంట్స్ ని కాస్త పక్కన పెడితే పూరి సినిమాల్లో డీఫాల్ట్ గా ఉండే యాక్షన్ ఎలిమెంట్స్ భారీ స్థాయిలో ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అయితే సినిమాలో ఈ యాక్షన్ జోన్ లో ముగ్గురు విలన్లు ఉండబోతున్నారు… సినిమాలో హీరో ఫేస్ చేయబోయేది వీళ్ళనే…

పునీత్ నిస్సార్ : తెలుగు సినిమాకి కొత్త కాదు.. తన 150 సినిమాల్లో ఇప్పటికే 5 సినిమాలు తెలుగులో చేశాడు. వాటిలో 3 మాస్టర్, ఇంద్ర, ఠాగూర్ చిరంజీవి సినిమాలైతే, 2 అల్లరి పిడుగు, నరసింహుడు బాలకృష్ణ సినిమాలు. ఇప్పుడు రామ్ సినిమాలో కనిపించబోతున్నాడు.

 

ఆశిష్ విద్యార్థి : పూరి సినిమాలకు కొత్త కాదు… ఇప్పటికే పోకిరి, చిరుత సినిమాల్లో నటించాడుభారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ లో నటించాడు. ఈ సినిమాలో కూడా అదే స్థాయి రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.

సాయాజీ షిండే : పూరి సినిమాలో ఈ నటుడు ఉన్నాడంటే క్యారెక్టరైజేషన్ నిస్పెషల్ గా ప్రెజెంట్ చేస్తాడు. ఇకపోతే సాయాజీ సినిమాలో విలనా..? కాదా..? లాంటివి పక్కన పెడితే సినిమాలో కోర్ యాక్షన్ సీక్వెన్సెస్ లో కీ రోల్ ప్లే చేయబోతున్నాడు సాయాజీ షిండే.