సామి రిలీజ్ డేట్ ఫిక్స్

Saturday,September 15,2018 - 11:07 by Z_CLU

విక్రమ్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సామీ స్క్రేర్. ఇంతకుముందు యముడు సిరీస్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేసిన హరి, ఈ సినిమాను డైరక్ట్ చేశాడు. గతంలో విక్రమ్-హరి కాంబోలో సామి అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. మళ్లీ ఇన్నేళ్లకు సామి స్క్రేర్ సిద్ధమైంది. సెప్టెంబర్ 21న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

సామి సినిమా తెలుగులో లక్ష్మీనరసింహగా రీమేక్ అయింది. తమిళ్ లో ఈ సినిమాకు సామి స్క్వేర్ అనే టైటిల్ పెట్టినప్పటికీ, తెలుగులో మాత్రం ఇది సామి పేరుతోనే తెరపైకి రానుంది. అయితే తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి ఇది విడుదలవుతుందా అవ్వదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తున్నాడు విక్రమ్. మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీప్రసాద్
అందించిన పాటలు కూడా తమిళనాట ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి. తెలుగులో ఈ సినిమాను పుష్యమి ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణారెడ్డి సమర్పిస్తున్నారు.