300 కోట్ల బడ్జెట్ తో విక్రమ్ సినిమా

Tuesday,January 09,2018 - 04:16 by Z_CLU

అక్టోబర్ నుండి చియాన్ విక్రమ్ సినిమా సెట్స్ పైకి రానుంది. 300 కోట్ల బడ్జెట్ తో మల్టీ లాంగ్వేజెస్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘మహావీర కర్ణ’ అని టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ రోజే ఈ మూవీ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

R.S. వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా మహాభారతం ఆధారంగా కర్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా అక్టోబర్ 2018 లో సెట్స్ పైకి రానుంది.

 

బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా యునైటెడ్ ఫిల్మ్ కింగ్ డమ్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ఈ సినిమాని 2019 క్రిస్మస్ కి రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.