విక్రమ్ కుమార్ ది బెస్ట్ డైరెక్టర్ – అనూప్ రూబెన్స్

Saturday,December 30,2017 - 01:04 by Z_CLU

విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘హలో’ టాలీవుడ్ లో ఇంకా అంతే స్ట్రాంగ్ గా ప్రదర్శించబడుతుంది. సినిమా సక్సెస్ కి విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే, అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ మెయిన్ రీజన్ అయితే అనూప్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎసెట్ అయింది.

ఇష్క్ సినిమాతో బిగిన్ అయిన విక్రమ్ కుమార్, అనూప్ జర్నీ, ‘మనం’ ఆ తరవాత రిలీజైన ‘హలో’ సక్సెస్ తో మరింత పర్ఫెక్ట్ కాంబో అని ప్రూఫ్ చేసుకుంది. విక్రమ్ కుమార్ మ్యాజికల్ సిచ్యువేషన్స్ కి మరింత ఎసెన్స్ ని ఆడ్ చేసే అనూప్ రూబెన్స్, విక్రమ్ కుమార్ ని ది బెస్ట్ డైరెక్టర్ అంటూ పొగడ్తలతో ముంచేశాడు.

అఖిల్ నుండి ఫ్యాన్స్ ఎలాంటి సినిమాను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో కరెక్ట్ గెస్ట్ చేసిన విక్రమ్ కుమార్, మ్యూజిక్ విషయంలో అనూప్ కి అటువంటి ఇంస్ట్రక్షన్స్ ఇవ్వడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాతో అఖిల్ ని సింగర్ గా ఇంట్రడ్యూస్ చేసిన అనూప్ ఈ సినిమాతో తన 50 సినిమాలు కంప్లీట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాప్పీగా ఉన్నాడు.