అర్జున్ రెడ్డి రీమేక్ కు కొత్త దర్శకుడు

Saturday,February 09,2019 - 03:19 by Z_CLU

టాలీవుడ్ కల్ట్ మూవీ అర్జున్ రెడ్డి తమిళ్ లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాల దర్శకత్వంలో వర్మ టైటిల్ తో ఇది తెరకెక్కింది. విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా అవుట్-పుట్ విక్రమ్ కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో సినిమా మొత్తం రీషూట్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

దీంతో ఈ ప్రాజెక్టు నుంచి బాల తప్పుకున్నాడు. ఇప్పుడు అతడి స్థానంలో గౌతమ్ మీనన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. స్వయంగా విక్రమ్, గౌతమ్ మీనన్ తో చర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మేగ చౌదరిపై కూడా డౌట్స్ పెరుగుతున్నాయి. ప్రాజెక్టు నుంచి ఆమెను కూడా తప్పించే ఛాన్సులు ఉన్నాయంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద వర్మ సినిమా మళ్లీ మొదటికొచ్చింది. ఈనెలలో థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాను రీషూట్ చేసి జూన్ లో విడుదల చేస్తామని మేకర్స్ ఎనౌన్స్ చేశారు.