ఒకేసారి 2 సినిమాలు రెడీ చేస్తున్న విక్రమ్

Thursday,June 28,2018 - 11:55 by Z_CLU

ఏడాదికి ఒక సినిమా చేసే విక్రమ్ ఈసారి స్పీడ్ పెంచాడు. స్కెచ్ ఫ్లాప్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న ఈ హీరో, ఇప్పుడు ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్టుల్ని ఫైనల్ స్టేజ్ కు తీసుకొచ్చాడు. వీటిలో ఒకటి సామి సీక్వెల్ కాగా, ఇంకోటి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేస్తున్న ధృవనక్షత్రం.

గతంలో విక్రమ్-హరి కాంబోలో వచ్చిన సామి సినిమా సూపర్ హిట్ అయింది. ఇదే సినిమా తెలుగులో లక్ష్మీనరసింహా పేరుతో రీమేక్ అయి, ఇక్కడ కూడా హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు విక్రమ్. హరి దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ కు సామి స్క్వేర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ప్రస్తుతం సామి స్క్వేర్ సినిమాకు సంబంధించి సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత మరో వారం రోజుల షూటింగ్ మాత్రం పెండింగ్ ఉంది. సినిమాలో విక్రమ్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

సామి స్క్వేర్ తో పాటు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేస్తున్న ధృవనక్షత్రం సినిమాను కూడా ఫైనల్ స్టేజ్ కు తీసుకొచ్చాడు విక్రమ్. ఆగస్ట్ లో ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. అదే ఆఖరి షెడ్యూల్. ఇలా ఇటు సామి స్క్వేర్, అటు ధృవనక్షత్రం సినిమాలు రెండింటినీ ఒకేసారి కొలిక్కి తీసుకొచ్చాడు విక్రమ్. త్వరలోనే ఈ రెండు సినిమాల విడుదల తేదీల్ని ప్రకటిస్తారు.