హ్యాపీ బర్త్ డే చియాన్

Monday,April 17,2017 - 11:03 by Z_CLU

విలక్షణ నటుడు, కోలీవుడ్ టాప్ హీరో విక్రమ్ ఈ రోజు తన బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేేట్ చేసుకుంటున్నాడు. నిజానికి టెక్నికల్ గా ఈరోజు అతడి పుట్టినరోజు అయినప్పటికీ.. ఫ్యాన్స్ కు మాత్రం 3 రోజుల ముందు నుంచే సంబరాలు ప్రారంభమైపోయాయి. అలాా టోటల్ సౌత్ లో 2 రోజులుగా ట్రెండింగ్ అవుతున్నాడు విక్రమ్.

తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా విశేషాలు మోసుకొచ్చాడు బర్త్ డే బాయ్ విక్రమ్. ప్రస్తుతం ఈ హీరో విజయ్ చందర్ దర్శకత్వంలో స్కెచ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేశారు. ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో స్కెచ్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తమన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నవంబర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ మూవీతో పాటు సైమల్టేనియస్ గా మరో సినిమా కూడా చేస్తున్నాడు విక్రమ్. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ చేస్తున్న ఆ సినిమా పేరు ధృవనక్షత్రం. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా, పుట్టినరోజు సందర్భంగా మరికొన్ని స్టిల్స్ విడుదల చేేశారు. ఇలా 2 సినిమాలతో ఈరోజు తన పుట్టినరోజును ఫుల్ జోష్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు విక్రమ్.