Master రిలీజ్ డేట్ ఫిక్స్!

Tuesday,December 29,2020 - 01:37 by Z_CLU

విజయ్ Master సినిమా వచ్చే సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సంక్రాంతి కి రానున్న Krack , Red సినిమాలు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి.తాజాగా విజయ్ మాస్టర్ కూడా డేట్ లాక్ చేసుకొని సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. జనవరి 13 న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.

లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కార్తి హీరోగా లోకేష్ దర్శకత్వం వహించిన ఖైది సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకొని మంచి విజయం అందుకుంది. దీంతో తెలుగులో కూడా ఈ సినిమాపై బజ్ నెలకొంటుంది. ముఖ్యంగా అనిరుద్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. మరి రాబోయే సంక్రాంతికి మాస్టర్ తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్ళు రాబడుతుందో చూడాలి.