విజయ్ సినిమాకు లైన్ క్లియర్.. నవంబర్ 9 రిలీజ్

Friday,November 03,2017 - 11:02 by Z_CLU

తమిళ్ లో గ్రాండ్ హిట్ అయిన మెర్సెల్ సినిమా అదిరింది పేరుతో తెలుగులోకి డబ్ అయింది. సెన్సార్ కారణంగా 2 సార్లు వాయిదాపడిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ఎట్టకేలకు థియేటర్లలోకి రానుంది. ఈనెల 9న అదిరింది సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. U/A సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా డ్యూరేషన్ 170 నిమిషాలు.

తమిళనాట మెర్సల్ (అదిరింది) సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఏకంగా 2వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా దూసుకుపోతోంది. విజయ్ సరసన నిత్యామీనన్, కాజల్, సమంత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ స్క్రీన్ ప్లే సమకూర్చారు.

ఆట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన అదిరింది సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఇప్పటికే తెలుగు వెర్షన్ పాటలు విడుదలయ్యాయి. ఈ సినిమా సక్సెస్ అయితే విజయ్ కు తెలుగులో మరింత మార్కెట్ పెరుగుతుంది.