విజయ్ దేవరకొండలో ఒరిజినాలిటీ ఉంది - బన్నీ

Monday,November 12,2018 - 11:57 by Z_CLU

విజయ్ దేవరకొండను మరోసారి పొగడ్తల్లో ముంచెత్తాడు హీరో అల్లు అర్జున్. తామంతా బ్యాక్ గ్రౌండ్ తో హీరోలుగా ఎదిగితే, దేవరకొండ మాత్రం తనను తాను చెక్కుకుంటూ ఓ హీరోగా ఎదిగాడని మెచ్చుకున్నాడు. నటనలో ఉన్న ఒరిజినాలిటీనే విజయ్ దేవరకొండను స్టార్ ను చేసిందని అన్నాడు బన్నీ.

విజ‌య్ ద‌గ్గ‌ర ఒరిజినాలిటీ ఉంటుంది. అది జ‌నాల‌కి న‌చ్చింది. విజ‌య్ ఈజ్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మ‌ర్. మేమంద‌రం ఒక గోల్డెన్ ప్లేట్ నుంచి వ‌చ్చాం. త‌ను ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం నుంచి స్టెప్ బై స్టెప్ చాలా క‌ష్ట‌ప‌డుతూ ఎదుగుతూ వ‌చ్చారు. నేను ఎంత పెద్ద యాక్ట‌ర్ అయినా కావొచ్చుకాని ఐ నెవ‌ర్ మేడ్ సెల్ఫ్‌. త‌ను చెక్కుకున్న శిల్పం త‌ను.

టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఇలా విజయ్ దేవరకొండను మెచ్చుకున్నాడు బన్నీ. దేవరకొండ యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆ టాలెంట్ పై కామెంట్ చేయడం, జోకులు వేయడం మంచిది కాదన్నాడు బన్నీ.

సొసైటీలో ఎంత ఎదిగితే అంత నెగిటివిటీ కూడా ఒక్కోసారి వ‌స్తుంది. విజ‌య్ నువ్వు అవేమి ప‌ట్టించుకోవ‌ద్దు. ఐ రియాల్లీ ఎంజాయ్ యువ‌ర్ స‌క్సెస్‌.

ఒక సినిమాకి ఇంత మంది క‌ష్ట‌ప‌డ్డారంటే దాని వెనుక ఎన్ని జీవితాలున్నాయో ఆలోచించాలని కోరాడు బన్నీ.. పైర‌సీని ఎంక‌రేజ్ చేయొద్దని, థియేట‌ర్స్‌కి వెళ్లి సినిమాని చూడమని కోరాడు.