విజయశాంతి... బ్యాక్ టు యాక్షన్

Saturday,October 26,2019 - 11:54 by Z_CLU

14 ఏళ్ల గ్యాప్
అయినా తగ్గని గ్రేస్
లేడీ అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ అదిరింది. సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి ఆమె లుక్ ను ఈరోజు విడుదల చేశారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ లుక్ లో భారతి పాత్రలో హుందాగా కనిపిస్తున్నారు విజయశాంతి. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయశాంతి చేస్తున్న సినిమా ఇది

మహేష్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు విజయశాంతి. ఈమె పాత్ర కోసం నగరశివార్లలో భారీ భవంతి సెట్ వేశారు. ఆ సెట్ లోనే చాలా భాగం షూటింగ్ కూడా చేశారు. సినిమాలో విజయశాంతి పాత్ర.. బ్యాక్ టు యాక్షన్ అనేలా ఉంటుందంటున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి.

సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ ను నవంబర్ చివరి వారానికి పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. జనవరి 12న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.