మహేష్ బాబు సినిమాలో విజయశాంతి..?

Monday,March 11,2019 - 01:32 by Z_CLU

మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉండబోతుందో అని, అటు మహేష్ బాబు, ఇటు అనిల్ రావిపూడి సినిమాలన్నీ ముందు పెట్టేసుకుని బేరీజు వేసుకునే లోపు, ఆ అంచనాలన్నింటినీ తన్ని కొట్టినట్టు ఈ సినిమాలో విజయశాంతి కీ రోల్ ప్లే చేస్తుందనే టాక్ ఒకటి బయటికొచ్చింది.

మ్యాగ్జిమం ఈ సినిమా జూలై నుండి సెట్స్ పైకి వచ్చే చాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ కూడా లాక్ చేసుకున్నాడట అనిల్ రావిపూడి. అందుకే టైమ్ వేస్ట్ చేసుకోకుండా కాస్టింగ్ పై దృష్టి పెట్టినట్టున్నాడు. సరాసరి ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని సీనియర్ హీరోయిన్ ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేద్దామనుకుంటున్నాడు. ఈ టాక్ తో అప్పటి వరకు ఫ్యాన్స్ మైండ్ లో హీరోయిన్ ఎవరా…? అని రేజ్ అయి ఉన్న క్వశ్చన్ కాస్త అటకెక్కేసింది. ఫోకస్ మొత్తం ఈ రాములమ్మ పైనే ఉంది.

సోషల్ మీడియాలో ఈ రేంజ్ హీట్ జెనెరేట్ చేస్తున్న ఈ న్యూస్ ఎంతవరకు అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందో తెలీదు కానీ, ఫ్యాన్స్ లో మాత్రం స్కై రేంజ్ లో వైబ్రేషన్స్ ఉన్నాయి. ఏది ఏమైనా గతంలో వీళ్ళిద్దరూ ‘కొడుకు దిద్దిన కాపురం’ లో తల్లీ కొడుకుల్లా నటించిన విషయం ఒక్కసారిగా  గుర్తుకొచ్చేసింది. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇలా, ఈ సినిమాతో  స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారన్నమాట. ఎప్పుడో 2006 లో ‘నాయుడమ్మ’ లో కనిపించిన విజయశాంతి, మళ్ళీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది.

దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇంకా పక్కా ఇన్ఫర్మేషన్ లేదు కానీ, మహేష్ బాబు సరసన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారని తెలుస్తుంది. రేపో మాపో అన్ని డీటేల్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.