విజయ నిర్మలకి డాక్టరేట్

Friday,May 12,2017 - 12:18 by Z_CLU

 నటిగా అద్భుతమైన సినిమాల్లో నటించి, 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఘట్టమనేని విజయనిర్మల గారికి రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ యు.కె. డాక్టరేట్ తో సత్కరించనుంది. తెలుగు సినిమా హిస్టరీలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి ఎక్కి, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును దక్కించుకున్న విజయ నిర్మల గారికి ఇప్పడు డాక్టరేట్ దక్కడంతో సినిమా ఇండస్ట్రీ ప్రసంసల వర్షం కురిపిస్తుంది.

‘పాండురంగ మహత్యం’ సినిమాలో బాల్య కృష్ణుడిగా సినీరంగ ప్రవేశం చేసిన విజయ నిర్మల తెలుగు, తమిళ మళయాళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, సహజ నటిగా మంచి గుర్తింపు సాధించారు. ఆ తరవాత ‘మీనా’ సినిమాతో డైరెక్టర్ గా టర్న్ అయిన విజయ నిర్మల సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎంతో మందికి ఇన్స్ పిరేషన్ లా నిలిచారు.