Vijay Vamsi Paidipally Movie - ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు?

Wednesday,May 26,2021 - 02:10 by Z_CLU

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తెలుగు-తమిళ్ లో ఓ భారీ సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు వంశీ పైడిపల్లి. ఇప్పటికే విజయ్ కి స్క్రిప్ట్ వినిపించి లాక్ చేసిన వంశీ పైడిపల్లి ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్, షెడ్యుల్స్ ప్లానింగ్ తో బిజీగా ఉన్నాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు , శిరీష్ నిర్మించబోతున్న ఈ సినిమాను వచ్చే నెల 22న అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఎనౌన్స్ మెంట్ కి ఆ డేట్ ఫిక్స్ చేశారు.

అప్పటివరకు మ్యూజిక్ డైరెక్టర్ , మిగతా కాస్టింగ్ ఫైనల్ చేస్తారు. విజయ్ కి తెలుగులో ఈ మధ్య కాస్త క్రేజ్ వచ్చింది. అతను నటించిన ‘అదిరింది’, ‘విజిల్’, ‘మాస్టర్’ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో బాగా కలెక్ట్ చేశాయి. ఇక వంశీ చెప్పిన కథ విజయ్ కి బాగా నచ్చిందని అందుకే ఈ బైలింగ్వెల్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. తాజాగా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ‘మహర్షి’ సినిమాకు నేషనల్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు వంశీ పైడిపల్లి. ఈ మేరకు టీం తో కలిసి పకడ్బందీగా ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు. జులై లేదా ఆగస్ట్ నుండి ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం. మరి ఈ క్రేజీ బైలింగ్వెల్ సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం అటు కోలీవుడ్ ఆడియన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics