పుష్ప కాంట్రవర్సీ.. రీజన్ చెప్పిన తమిళ హీరో

Tuesday,July 14,2020 - 11:58 by Z_CLU

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు నుంచి అతడు తప్పుకున్నాడు. దీంతో చాలా గాసిప్స్ పుట్టుకొచ్చాడు. క్యారెక్టర్ బాగాలేదని కొందరు, ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడని మరికొందరు గాసిప్స్ అల్లేశారు. ఎట్టకేలకు దీనిపై స్పందించాడు విజయ్ సేతుపతి.

పుష్ప సినిమా నుంచి తను తప్పుకున్న మాట నిజమేనని ప్రకటించిన విజయ్.. ఈ విషయాన్ని స్వయంగా వెళ్లి దర్శకుడికి వివరించినట్టు చెప్పుకొచ్చాడు. సినిమాకు దర్శకుడు ఊహించిన స్థాయిలో తను కాల్షీట్లు ఇవ్వలేకపోయానని అందుకే పుష్ప నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఓ మంచి పాత్రను వదులుకున్నందుకు బాధపడ్డాడు కూడా.

విజయ్ సేతుపతి స్టేట్ మెంట్ తో ఇన్నాళ్లూ వినిపించిన పుకార్లకు చెక్ పడింది. విజయ్ సేతుపతి పోషించాల్సిన విలన్ పాత్ర కోసం కన్నడ నటుడు ధనుంజయను తీసుకున్నారు.