రూమర్స్ కు చెక్.. విజయ్ వచ్చేశాడు

Monday,August 19,2019 - 03:08 by Z_CLU

ఉప్పెన సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడంటూ ఆమధ్య తెగ ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఈ రూమర్లకు చెక్ పడింది. ఉప్పెన సెట్స్ పైకి విజయ్ సేతుపతి వచ్చేశాడు. హీరో వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి మధ్య కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సారధి స్టుడియోస్ లో ఈ షూట్ నడుస్తోంది.

ఈ సినిమాతో సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమౌతున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కృతి షెట్టి హీరోయిన్ గా పరిచయమౌతోంది. హై-ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.

సినిమాకు సంబంధించి ఇప్పటికే కాకినాడలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. హీరో వైష్ణవ్ తేజ్ పై మేజర్ పార్ట్ షూటింగ్ అక్కడే పూర్తిచేశారు. ఇప్పుడు సెకెండ్ షెడ్యూల్ లో భాగంగా “సారధి”లో వైష్ణవ్-విజయ్ సేతుపతి కాంబోలో సీన్స్ తీస్తున్నారు. 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ నడుస్తుంది.