ఎక్స్ క్లూజివ్: వైష్ణవ్ తేజ్ సినిమాలో విలన్ ఫిక్స్

Sunday,March 17,2019 - 04:15 by Z_CLU

మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమా రోజురోజుకు బిగ్ ప్రాజెక్టుగా మారుతోంది. ఈ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెన్స్ గా ఉన్న మేకర్స్, ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సినిమాలో విలన్ పాత్రపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. దాదాపు నెల రోజుల పాటు ఆలోచించి, ఫైనల్ గా విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నారు.

తమిళ్ లో విజయ్ సేతుపతి పెద్ద స్టార్. తెలుగులో కూడా అతడికి అభిమానులున్నారు. ఇలాంటి వ్యక్తిని వైష్ణవ్ తేజ్ సినిమాలో విలన్ గా తీసుకోవడంతో ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. క్యారెక్టర్ లో దమ్ము లేకపోతే అస్సలు ఒప్పుకోడు విజయ్ సేతుపతి. అలాంటి నటుడు ఈ సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడంటే, వైష్ణవ్ తేజ్ సినిమాలో కంటెంట్ బాగుందనే విషయం అర్థమౌతూనే ఉంది.

విజయ్ సేతుపతికి ఇదే తొలి తెలుగు సినిమా కాదు. ప్రస్తుతం ఈ నటుడు చిరంజీవి సైరా సినిమాలో నటిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ సినిమా ఇతడికి రెండోది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.