బాలీవుడ్ హీరోయిన్ తో విజయ్ ?

Thursday,May 11,2017 - 10:00 by Z_CLU

‘పెళ్లి చూపులు’ సినిమాతో సూపర్ అందుకొని హీరోగా వరుస సినిమాలతో బిజీ హీరో గా మారిన విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా పుట్టిన రోజును పురస్కరించుకొని మరో సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘పెళ్లి చూపులు’ సినిమా నిర్మాణంలో భాగమైన “బిగ్ బెన్ సినిమాస్” బ్యానర్ పై యష్ రంగినేని నిర్మాణం లో దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించనున్న ఈ సినిమాకు బాలీవుడ్ హీరోయిన్ ను ఫైనల్ చేశారట మేకర్స్..


యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందనున్నఈ సినిమా లో విజయ్ దేవరకొండ సరసన దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేఖ్ నటించనుందని వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.. గ్లామరస్ పెర్ఫార్మెన్స్ తో కూడిన క్యారెక్టర్ కావడంతో ఈ రోల్ కి ఫాతిమా అయితే బాగుంటుందని భావించిన యూనిట్ లేటెస్ట్ గా ఈ భామ ను కలిసి స్టోరీ వినిపించారని.. స్టోరీ, క్యారెక్టర్ బాగా నచ్చడం తో ఫాతిమా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్ వినిపిస్తుంది. సో అంతా సెట్ అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ తో రొమాన్స్ చేస్తాడన్నమాట విజయ్…