'విజయ్ దేవరకొండ' నెక్స్ట్ లిస్టు ఇదే ...?

Sunday,July 28,2019 - 12:40 by Z_CLU

ప్రస్తుతం క్రాంతి మాధవ్, ఆనంద్ అన్నాామళై అనే ఇద్దరు దర్శకులతో 2 సినిమాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత విజయ్ వరుసగా ముగ్గురు పెద్ద దర్శకులతో సినిమాలు కమిట్ అయ్యాడని తెలుస్తుంది. అందులో ముందుగా వినిపిస్తున్న స్టార్ డైరెక్టర్ పేరు త్రివిక్రమ్. త్రివిక్రమ్-విజయ్ కాంబోలో సినిమా ఉంటుందని చాన్నాళ్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తో విజయ్ సినిమా కన్ఫర్మ్ కానీ అదెప్పుడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం.

సైరా నరసింహా రెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి విజయ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందనే వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతానికైతే తన పూర్తి ఫోకస్ ప్రెస్టిజియస్ ‘సైరా’ మీదే పెట్టాడు సురేందర్. ఆ సినిమా రిలీజ్ అయ్యాకే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించే అవకాశం ఉంది.

ఇక గీత గోవిందం దర్శకుడు పరశురాం బుజ్జి డైరెక్షన్ లో కూడా మళ్ళీ ఓ సినిమా చేయనున్నాడు విజయ్. ఇప్పటికే విజయ్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు ఈ దర్శకుడు.

విజయ్ ఇలా తన నెక్స్ట్ సినిమాలను వరుసగా సీనియర్ డైరెక్టర్స్ తో ప్లాన్ చేసుకుంటూ రెడీ అవుతున్నాడు. మరి ఈ మూడు సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయో చూడాలి.