Vijay Deverakonda Liger - క్రేజీ అప్ డేట్

Friday,December 17,2021 - 09:51 by Z_CLU

Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) Releasing In Theatres On 25th August, 2022, Catch A Glimpse Of Madness On 31st December

విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘లైగర్’ మీద భారీ అంచనాలు నెలకొంటున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ? అని మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న అందరికీ రిలీజ్ డేట్ ప్రకటనతో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 25 న రిలీజ్ చేయబోతునట్లు ఎనౌన్స్ చేశారు.

కేవలం రిలీజ్ డేట్ చెప్పడమే కాదు మరో అప్ డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 31 న గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ తో మ్యాడ్ నెస్ పక్కా అంటూ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసారు. సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్.

ఇప్పటికే సినిమాలో మైక్ టైసన్ ని తీసుకొనే భారీ బజ్ క్రియేట్ చేస్తున్న పూరి ఈ సినిమాను బెస్ట్ ఫిలింగా తీర్చిదిద్దాలని ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో పూరి మేకింగ్ కి ఎక్కువ టైం తీసుకున్న సినిమా ఇదే. సెకండ్ వేవ్ తర్వాత కూడా వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయకుండా రీ వర్క్ చేశాడు పూరి. ప్రస్తుతానికి షూటింగ్ ఫినిషింగ్ స్టేజికి చేరుకుంది. టీజర్ గ్లిమ్స్ తో న్యూ ఇయర్ నుండి ప్రమోషన్ మొదలు పెట్టి భారీ లెవెల్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు , తమిళ్ , హిందీ , కన్నడ , మలయాళం ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా రమ్య కృష్ణ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.