Vijay Deverakonda Liger - లైగర్ ఫస్ట్ గ్లింప్స్

Friday,December 31,2021 - 05:07 by Z_CLU

Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) Liger Glimpse Out

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ మొద‌ల‌య్యాయి. త‌మ అభిమాన హీరోల‌ని సరికొత్త అవ‌తారంలో ప్ర‌జెంట్ చేసే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) ఫ‌స్ట్  గ్లింప్స్ ఈ రోజు విడుద‌ల‌య్యింది. విడుద‌లైన క్ష‌ణాల్లోనే ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో నేష‌న‌ల్ వైడ్ గా ట్రెండింగ్‌లోకి రావ‌డం విశేషం.

ఈ గ్లింప్స్  లో విజ‌య్‌ దేవ‌ర‌కొండ కండలు తిరిగిన దేహంతో డిఫరెంట్ మేకోవర్ & యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండను స్లమ్ డాగ్ గా.. ముంబై వీధుల్లో చాయ్ వాలా నుంచి అంతర్జాతీయ బాక్సర్ గా ఎదిగినట్లు చూపించారు ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాధ్‌.

– LIGER GLIMPSE

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ‘లైగర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి విజయ్ దేవరకొండ పడిన శ్రమంతా ‘లైగర్’ గ్లింప్స్  లో కనిపిస్తోంది.

‘వీ ఆర్ ఇండియన్స్’ అంటూ దేశభక్తిని పెంపొందించేలా తన వాయిస్ ని గట్టిగా వినిపించాడు. ఫస్ట్ గ్లింప్స్  లో యాక్షన్ సీన్స్ – బ్యాగ్రౌండ్ స్కోర్ – విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థాయ్ ల్యాండ్ కు చెందిన కెచ్చా  ఈ సినిమాకు స్టంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఈ చిత్రానికి జానీ షేక్ బాషా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా డైనమేట్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీదకు పరిచయం కాబోతోన్నారు.

ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

రమ్యకృష్ణ విజ‌య్‌దేవ‌ర‌కొండ అమ్మ‌గా క‌నిపించ‌గా రోనిత్ రాయ్ అతని గురువుగా క‌నిపించారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మ‌ల‌యాళ‌ భాషల్లో విడుద‌ల‌కాబోతుంది. లైగర్ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది.