రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విజయ్ దేవరకొండ ?

Sunday,March 03,2019 - 04:08 by Z_CLU

విజయ్ దేవరకొండ ప్రస్తుతం భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడితో ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుందని తెలుస్తోంది.

ఏప్రిల్ లో మహేష్ తో పాటు నాగ చైతన్య , నాని  బాక్సాఫీస్ దగ్గర హంగామా చేయడానికి రెడీ అవుతుండగా ‘డియర్ కామ్రేడ్’ తో మేలో సందడి చేయబోతున్నాడట విజయ్. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా మే 25న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ కంబైన్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఫస్ట్ లుక్ తో పాటు జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన సింగిల్ కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.