మరోసారి తెరపైకి అర్జున్ రెడ్డి జంట

Friday,March 08,2019 - 02:13 by Z_CLU

ఎప్పుడూ సెట్స్ పై రెండు సినిమాల్ని కంటిన్యూ చేయడం విజయ దేవరకొండ స్టయిల్. ఈసారి కూడా అదే పనిచేస్తున్నాడు ఈ యంగ్ స్టార్. డియర్ కామ్రేడ్ సినిమా కొలిక్కి వస్తున్న వేళ.. క్రాంతి మాధవ్ సినిమాతో పాటు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు.

క్రాంతి మాధవ్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసిన విజయ్ దేవరకొండ.. త్వరలోనే ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీలో బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడు విజయ్. ఈ మేరకు చెన్నైలో బైక్ రేసింగ్ కు సంబంధించి వారం రోజులు ట్రైనింగ్ కూడా పూర్తిచేశాడు.

మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ సినిమాతో అర్జున్ రెడ్డి కాంబో మరోసారి కలవబోతోంది. అవును.. ఆనంద్ అన్నామలై సినిమాలో విజయ్ దేవరకొండ సరసన షాలినీ పాండే మెరవనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అతిత్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సైమల్టేనియస్ గా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అఫీషియల్ స్టేట్ మెంట్ ఇంకా రాలేదు.