విజయ్ దేవరకొండ సరసన ‘కిర్రాక్’ బ్యూటీ

Wednesday,September 06,2017 - 04:10 by Z_CLU

త్వరలోనే జీఏ-2 పిక్చర్స్ (గీతా ఆర్ట్స్యూవీ క్రియేషన్స్ కలిసి పెట్టిన సంస్థ) బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రష్మికను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా వెల్లడించింది. ప్రాజెక్టులోకి తనను హీరోయిన్ గా తీసుకున్నందుకు అందరికీ థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది.

నిజానికి ఈ సినిమాలో మొదట లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె స్థానంలో రష్మికను తీసుకున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయన కిర్రాక్ పార్టీ అనే సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తెచ్చుకుంది.

అర్జున్ రెడ్డి సినిమా విడుదలకు ముందే ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అవ్వడంతో తాజా ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. పరశురాం దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది ఈ మూవీ.