బడా బ్యానర్లో రెండు సినిమాలు...

Wednesday,March 01,2017 - 10:16 by Z_CLU

‘పెళ్లి చూపులు’ సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నయంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రెజెంట్ ‘ద్వారక’ అనే సినిమాతో పాటు ‘అర్జున్ రెడ్డి’ అనే మరో సినిమాను కూడా త్వరలోనే థియేటర్స్ లోకి తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే..అయితే ఉన్నట్టుండి ఈ కుర్ర హీరో ఓ బడా బ్యానర్ లో రెండు సినిమాలకు సైన్ చేశాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది…

వివరాల్లోకెళ్తే విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ రెండు సినిమాలకు కమిట్ అయ్యాడట. ఇక పై ‘గీతా ఆర్ట్స్ 2’ అనే బ్యానర్ పై కొన్ని చిన్న సినిమాలు నిర్మించాలని డిసైడ్ అయిన అల్లు అరవింద్ ఈ కుర్ర హీరోతో ఒకే సారి ఓ రెండు సినిమాలు తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారట. వీటిలో ఓ సినిమాకు రాహుల్ అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతుండగా మరో సినిమాకు పరశురామ్ బుజ్జి దర్శకత్వం వహించబోతున్నాడట..ఈ రెండు సినిమాలను త్వరలోనే స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుందట గీతా ఆర్ట్స్ బ్యానర్…. ఏదేమైనా ఈ రెండు సినిమాలతో ఈ యంగ్ హీరో గోల్డెన్ ఛాన్స్ అందుకున్నట్టే…..