ఈ ‘శీనయ్య’ వరల్డ్ ఫేమస్ లవర్

Thursday,December 12,2019 - 06:53 by Z_CLU

విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజయింది. ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో హీరోయిన్ కి హీరోతో ఉండే రిలేషన్ షిప్ ఎలివేట్ అయ్యేలా పోస్టర్స్ ని రిలీజ్  చేయాలని ఫిక్సయిన మేకర్స్ ఈ రోజు ఐశ్వర్యా రాజేష్ కాంబినేషన్ లో పోస్టర్ రిలీజ్ చేశారు.

‘సువర్ణ’ గా కనిపించనుంది ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్. ‘మా ఆయనే వరల్డ్ ఫేమస్ లవర్’, మా శీనయ్యని ప్రేమికుల రోజున కలుద్దురు.’ అంటూ చేసిన ట్వీట్ ని బట్టి ఐశ్వర్యా, ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా, విజయ్ దేవరకొండ భార్యలా కనిపించనుందని తెలుస్తుంది.

అలాగే ఈ నెల 13 న ఈజా బెల్లా, 14 న కేథరిన్ తెరిసా, 15 న రాశిఖన్నా కాంబినేషన్ లో పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ పోస్టర్స్ లో ఈ హీరోయిన్స్ విజయ్ దేవరకొండ కి ఎలా రిలేట్ అవుతారనేది రివీల్ చేయబోతున్నారు. ఈ క్రమంలో జనవరి 3 న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫిబ్రవరి 14 న రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే.