టాక్సీవాలా మూవీ టీజర్ రివ్యూ

Wednesday,April 18,2018 - 08:02 by Z_CLU

అర్జున్ రెడ్డి నుంచి విజయ్ దేవరకొండ స్టోరీ సెలక్షన్ మారిపోయింది. ఆడియన్స్ తనను ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలాంటి కథలు సెలక్ట్ చేసుకోవాలో ఈ యంగ్ స్టార్ కు అర్థమైపోయింది. అందుకే టాక్సీవాలా చేశాడు. టీజర్ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది.

టాక్సీవాలా టీజర్ రిలీజ్ అయింది. సినిమా స్టోరీకి సంబంధించి టీజర్ లో ఒక్క క్లూ లేదు. కానీ అందులో ఏదో మేజిక్ కనిపించింది. టీజర్ అదిరిపోయింది. విజయ్ దేవరకొండ మరోసారి మెస్మరైజ్ చేశాడు. పేరుకు టాక్సీవాలానే అయినప్పటికీ.. మూవీ చుట్టూ చాలా యాంగిల్స్ ఉన్నాయనే విషయాన్ని టీజర్ ఎలివేట్ చేసింది.

తన లుక్స్ తో విజయ్ దేవరకొండ అదరగొట్టగా.. జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సుజిత్ సినిమాటోగ్రఫీ సినిమాకు హాలీవుడ్ లుక్ తీసుకొచ్చింది. రాహుల్ డైరక్ట్ చేసిన ఈ సినిమా సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది.