Crazy Combo - సుకుమార్ డైరక్షన్ లో దేవరకొండ

Monday,September 28,2020 - 02:48 by Z_CLU

కొన్ని కాంబినేషన్స్ ఎనౌన్స్ మెంట్ తోనే హైప్ క్రియేట్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఈరోజు అలాంటి కాంబినేషనే మూవీ లవర్స్ చర్చించుకునేలా చేసింది. అదే Sukumar-VijayDeverakonda కాంబో. అవును వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అందుకే ఎనౌన్స్ మెంట్ రాగానే అందరూ షాక్ అయ్యారు.

Kedar Selagamsetty అనే కొత్త నిర్మాత ఈ సినిమాను నిర్మించనున్నారు. నిర్మాత పుట్టిన రోజుని పురస్కరించుకొని ఈ సినిమాను ప్రకటించారు.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. 2022 రిలీజ్ టార్గెట్ గా సినిమాను రెడీ చేస్తారు. ప్రస్తుతం Allu Arjun తో Pushpa సినిమా చేస్తున్న సుక్కు… ఆ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే రౌడీతో సినిమాను మొదలుపెడతాడు. ఈ లోపు విజయ్ కూడా పూరి డైరెక్షన్ లో చేస్తున్న ‘ఫైటర్’ ను కంప్లీట్ చేస్తాడు.

వర్క్ చేసిన ప్రతీ హీరోని డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసి వారి కెరీర్ బెస్ట్ లుక్స్ ఇచ్చిన సుకుమార్, విజయ్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడా అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.