ట్రైనింగ్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ

Saturday,August 24,2019 - 11:05 by Z_CLU

మామూలుగానే పూరి మార్క్ హీరోలా ఉంటాడు విజయ్ దేవరకొండ. ఓ రకంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండ  పూరికి   రెడీమేడ్ మెటీరియలే.. మహా అయితే లుక్స్ విషయంలో కొన్ని చేంజెస్ జరుగుతాయేమో కానీ, పెద్దగా కష్టపడాల్సిన అవసరమే ఉండదనుకున్నారంతా… కానీ వ్యవహారం చూస్తుంటే అంత ఈజీ కాదనిపిస్తుంది. పూరి ఈ క్రేజీ హీరో కోసం  నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ రెడీ చేసుకున్నాడనిపిస్తుంది.

పూరి తెరకెక్కించబోతున్న సినిమా ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉండబోతుందని ఖచ్చితంగా ఇప్పుడే  క్లారిటీ  ఇవ్వడం కష్టమే కానీ, ఈ సినిమా కోసం ఏకంగా రియల్ టైమ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఫిక్స్ చేసుకున్న టైటిల్ ని, ఈ ట్రైనింగ్ ని బట్టి చూస్తే, పూరి విజయ్ దేవరకొండని నెవర్ సీన్ బిఫోర్ క్యారెక్టర్ తో ప్రెజెంట్ చేస్తాడనిపిస్తుంది.        

‘ఇస్మార్ట్ శంకర్’ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ఈ మాసివ్ ఫిలిమ్ మేకర్, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో బిజీగా ఉన్నాడు.