మన ఆడియన్స్ ని ఎవరూ బీట్ చేయలేరు -విజయ్ దేవరకొండ

Monday,March 08,2021 - 03:28 by Z_CLU

నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ లతో అనుదీప్ కే తెరకెక్కించిన ‘జాతి రత్నాలు’ సినిమా మార్చ్ 11న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా వరంగల్ లో సినిమాకు సంబంధించి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి తన ఫ్రెండ్స్ కోసం గెస్ట్ గా హాజరయ్యాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ.

ఈవెంట్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి టీంని విష్ చేశాడు విజయ్. ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ” మొన్న షూటింగ్ కోసం ముంబై వెళ్తే అక్కడ కూడా మన తెలుగు ప్రేక్షకుల గురించే గొప్పగా మాట్లాడుతున్నారు. మీ ఆడియన్స్ సినిమాలు చాలా చూస్తారు…అంటూ చెప్తున్నారు. మన తెలుగు ఆడియన్స్ ని బీట్ చేసే ప్రేక్షకులు ఎక్కడా లేరు. ఇక ఈరోజు ఈ స్టేజి మీద ఉండటానికి నా ఫ్రెండ్స్ నవీన్ , నాగి నే కారణం. నవీన్ నేను థియేటర్ ప్లే చేసే రోజుల నుండి క్లోజ్ ఫ్రెండ్స్. నాగీ నా కెరీర్ బిగినింగ్లో కీ రోల్ పోషించాడు. తను యాడ్ ఫిలిం చేసినా అందులో నాకు నటుడిగా అవకాశం ఇచ్చే వాడు. తను తీసిన మొదటి సినిమా ‘ఎవడె సుబ్రహ్మణ్యం’ లో కొట్లాడి మరీ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఈ ఫన్ ఫిలిం మంచి హిట్ అవ్వాలి. అనుదీప్ గురించి విన్నాను. షూటింగ్ లో నాగీ తన షార్ట్ ఫిలిం చూపిస్తూ నవ్వించేవాడు. ఈ ఫిలిం తనకి డైరెక్టర్ కి మంచి డెబ్యూ అవుతుందని అనుకుంటున్నా. ఇక టీం అందరికీ ఆల్ తే బెస్ట్. “అన్నారు.