Khushi ఫస్ట్ షెడ్యుల్ పూర్తి

Monday,May 23,2022 - 04:05 by Z_CLU

Kushi Movie Wraps Kashmir Schedule

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమా “ఖుషి” ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. గత నెల 23 తేదీ నుంచి కశ్మీర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. అక్కడి అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం గ్రూప్ ఫొటో దిగారు. కశ్మీర్ షెడ్యూల్ అమోజింగ్ ఫీల్ ఇచ్చింది, విజయ్, సమంతతో పాటు యూనిట్ అందరికీ కంగ్రాంట్స్ అంటూ దర్శకుడు శివ నిర్వాణ ట్వీట్ ద్వారా సంతోషాన్ని పంచుకున్నారు.

త్వరలోనే హైదరాబాద్ లో నెక్స్ట్  షెడ్యుల్ మొదలు కానుంది. ఆ తర్వాత వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు. ఇటీవలే విడుదల చేసిన “ఖుషి” టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ వై  నిర్మిస్తున్నారు. హేషం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాతో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics