Vijay Deverakonda ప్రారంభమైన #VD11

Thursday,April 21,2022 - 12:24 by Z_CLU

Vijay Deverakonda, Samantha New Movie Lanched

విజయ్ దేవరకొండ , సమంత జంటగా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ 11 వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా  హైదరాబాద్ లోని మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది. దర్శకులు హరీష్ శంకర్ , కొరటాల శివ , బాబీ , బుచ్చి బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటి షాట్ కి హరీష్ శంకర్ క్లాప్ నిచ్చారు.

vd11-launch-still-zeecinemalu

విజయ్ దేవరకొండ కోసం ఓ ఫ్యామిలీ స్టోరీ రెడీ చేసి హీరోయిన్ గా సమంతను తీసుకున్నాడు శివ నిర్వాణ. కాశ్మీర్ నేపథ్యంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కనుందని తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 23 నుండి కాశ్మీర్ లో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. అక్కడ ఓ భారీ షెడ్యుల్ పూర్తి చేసి యూనిట్ హైదరాబాద్ లో రెండో షెడ్యుల్ మొదలు పెడతారు.

మహానటి తర్వాత విజయ్ , సమంత కలిసి నటిస్తున్న ఈ సినిమాకు మలయాళం ‘హ్రిదయం’ ఫేం హేషం అబ్దుల్ వాహాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. తెలుగులో అతనికి ఇది మొదటి సినిమా. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ఎమోషనల్ లవ్ స్టోరీస్ తో మెస్మరైజ్ చేసిన శివ నిర్వాణ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics