నందిని రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

Sunday,November 26,2017 - 03:20 by Z_CLU

‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషనల్ హిట్ అందుకొని జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న యంగ్ హీరో విజయ్ దేవర కొండ ప్రస్తుతం రాహుల్ డైరెక్షన్ లో ఓ సినిమా, పరశురామ్(బుజ్జి) తో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ రెండు సినిమాల తర్వాత భరత్ కమ్మ అనే డైరెక్టర్ తో బిగ్ బెన్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.. ఈ సినిమాతో పాటు మరో వైపు నందిని రెడ్డి డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడట విజయ్ దేవరకొండ.

ప్రస్తుతం ఫాస్ట్ ఫేజ్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి లో లాంచ్ కానుందని, స్వప్నసినిమాస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. భరత్ కమ్మ సినిమాతో పాటే నందినిరెడ్డి మూవీ ని కూడా సెట్స్ పైకి తీసుకొచ్చి ఒకే టైంలో రెండు సినిమాలను ఫినిష్ చేసే ప్లాన్లో ఉన్నాడట విజయ్.