''హీరో''గా రాబోతున్న విజయ్ దేవరకొండ

Wednesday,March 13,2019 - 02:04 by Z_CLU

ఇప్పటికే చేతిలో 2 సినిమాలున్నాయి. అయినప్పటికీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమా ఎనౌన్స్ చేశాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా పేరు హీరో. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సెట్స్ పైకి రాబోతోంది ఈ యాక్షన్ అడ్వెంచర్.

ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాకి “హీరో” అనే టైటిల్ పెట్టినట్టు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. సినిమా షూటింగ్ ను ఏప్రిల్ 22 నుంచి ఢిల్లీ లో స్టార్ట్ చేయబోతున్నారు.

పూర్తి స్థాయి రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. దీని కోసం చెన్నైలో ఇప్పటికే వారం రోజులు బైక్ రేసింగ్ ప్రాక్టీస్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేలోపు డియర్ కామ్రేడ్ మూవీని పూర్తిచేయబోతున్నాడు.