విజయ్ ఫస్ట్ లుక్ అప్పుడే !

Sunday,February 16,2020 - 12:10 by Z_CLU

ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తో థియేటర్స్ లో సందడి చేస్తున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కంప్లీట్ గా కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు విజయ్. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో మూడు నెలల్లో అంటే విజయ్ పుట్టిన రోజున మే 9న రిలీజ్ చేస్తున్నారు.

ఇటివలే విజయ్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకున్నాడు. అందుకే రీసెంట్ ఇంటర్వ్యూలో మరో మూడు నెలల్లో కొత్త విజయ్ ని చూస్తారంటూ కాన్ఫిడెన్స్ గా చెప్పాడు. హీరోలను డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ప్రెజెంట్ చేయడం ఓ కొత్త లుక్ లో చూపించడం పూరి స్పెషాలిటీ. మరి విజయ్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో తెలియాలంటే మూడు నెలలు ఆగాల్సిందే.