Vijay Deverakonda LIGER - షూటింగ్ అప్ డేట్స్

Monday,October 25,2021 - 05:31 by Z_CLU

Vijay Deverakonda LIGER Song Shoot In Mumbai

విజయ్ దేవరకొండ హీరోగా న‌టిస్తోన్న ప్యాన్‌ ఇండియా మూవీ లైగ‌ర్‌ (సాలా క్రాస్ బ్రీడ్). పూరిజ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్ మూవీ బాక్సింగ్ అభిమానుల‌కు, సాధారణ ప్రేక్షకులకు  ఐఫీస్ట్ కానుంది.

విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో తన డ్యాన్సులతో అందరినీ ఆశ్చర్యపరిచేందుకు రెడీ అయ్యారు. మాస్ స్టెప్పులతో ఆడియెన్స్‌ను ఆకట్టుకోనున్నారు.

ముంబైలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ మాస్ నంబర్‌కు సంబంధించిన  షూటింగ్ మొదలైంది. ఈ మేరకు నిర్మాత  ఛార్మీ ఓ పోస్ట్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ హ్యాండ్ మాత్రమే కనిపిస్తుండ‌గా.. ఫుల్ మాస్ లుక్కులో ఉండబోతోన్నట్టు హింటిచ్చారు.

– లైగర్ తో సింహం

‘ముంబైలో లైగర్ సాంగ్ షూటింగ్ ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ ఇది వరకు ఎప్పుడూ చేయనట్టుగా డ్యాన్స్ చేసి అందరినీ అబ్బురపరుస్తారు. నన్ను నమ్మండి. మాస్ క్రేజీగా ఉండబోతోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ చూశాక ఈ పోస్ట్ పెట్టకుండా ఉండలేకపోయాను.’ అంటూ ట్వీట్ చేశారు ఛార్మీ.

Vijay Deverakonda liger movie

బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ గా నిర్మిస్తున్నాయి.

నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను

సాంకేతిక బృందం:
దర్శక‌త్వం: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
బ్యానర్స్: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
కెమెరామెన్: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
స్టంట్ డైరెక్టర్: కెచ్చా

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics