రెండు సినిమాల తర్వాత విజయ్ చేయబోయే సినిమా అదే...

Sunday,April 15,2018 - 01:20 by Z_CLU

విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచేసాడు. ‘అర్జున్ రెడ్డి’తో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ సినిమాలను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ ముందుకెల్తున్నాడు. ఇప్పటికే ‘టాక్సీ వాలా’,’గీతా గోవిందం’, ‘మహానటి’ సినిమాలకు సంబంధించి షూటింగ్ ఫినిష్ చేసేసిన విజయ్  ప్రస్తుతం ఆనంద్ శంకర్ డైరెక్షన్ ‘నోటా’ అనే బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాడు. త్వరలో భరత్ కమ్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమా వచ్చే నెలలో స్టార్ట్ కానుంది.

ఈ రెండు సినిమాల తర్వాత విజయ్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేం క్రాంతి కుమార్ డైరెక్షన్ లో ఓ యూత్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజిలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ లో సెట్స్ పైకి రానుంది. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కే.ఎస్.రామారావు ఈ సినిమాను నిర్మించనున్నాడు.