Most Desirable VD - లిస్ట్ లో 3వ స్థానం

Sunday,August 23,2020 - 04:04 by Z_CLU

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ లో అతనికున్న ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తెలుగులోనే కాదు నేషనల్ లెవల్ లో కూడా విజయ్ సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గా ఇనస్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ దక్కించుకున్న ఫస్ట్ సౌత్ హీరోగా రికార్డు కొట్టిన విజయ్ ఇప్పుడు మరో మైలురాయి అందుకున్నాడు.

ఇండియాలోని టాప్ 50 మెస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో Vijay Deverakonda మూడో స్థానం దక్కించుకోవడం విశేషం. మొదటి స్థానంలో షాహిద్ కపూర్, రెండో స్థానలో రణ్ వీర్ సింగ్ ఉండగా మిగతా బాలీవుడ్ హీరోలను కిందకు నెట్టి విజయ్ మూడో స్థానం దక్కించుకున్నాడు.

ఇంతకుముందు హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మేన్ గా వరుసగా 2018, 2019 సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న రౌడీ స్టార్ ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ లో టాప్-3 ప్లేస్ కైవసం చేసుకోవటం అతని క్రేజ్ కు నిదర్శనం.

Vijay Deverakonda చేసిన సినిమాల కంటే అతడి యాటిట్యూడ్ కు ఫ్యాన్స్ ఎక్కువ.