మరో సినిమా లాక్ చేసిన దేవరకొండ

Monday,May 04,2020 - 01:14 by Z_CLU

 

ప్రస్తుతం పూరి డైరెక్షన్ లో ఓ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత దర్శకుడు శివ నిర్వాణతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. అయితే ఆ సినిమా కంటే ముందే మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట ఈ రౌడీ బాయ్.

అవును… ఇంద్రగంటి మోహనకృష్ణ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట విజయ్. ప్రస్తుతం విజయ్ సినిమా స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు ఇంద్రగంటి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

ప్రస్తుతానికైతే విజయ్ లిస్టులో ఇంకా కొందరు అప్ కమింగ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఇంద్రగంటి, శివ నిర్వాణ తర్వాత వారితో సినిమాలు చేసే అవకాశం ఉంది.