యంగ్ దర్శకుడితో దేవరకొండ?

Thursday,April 02,2020 - 05:11 by Z_CLU

వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ తర్వాత సినిమాల ఎంపికలో విజయ్ దేవరకొండ చాలా స్లో అయ్యాడు. ఎంతో ఆలోచించి పూరి జగన్నాధ్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. ఇప్పుడు మరో దర్శకుడితో సినిమాకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. అతడి పేరు వివేక్ ఆత్రేయ.

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో పాపులర్ అయ్యాడు వివేక్ ఆత్రేయ. ఇప్పుడు తన మూడో ప్రయత్నంగా విజయ్ దేవరకొండతో సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతానికైతే వీళ్లిద్దరి మధ్య కథాచర్చలు ముగిశాయి. మూవీ ఫైనల్ అయిందా లేదా అనే విషయం లాక్ డౌన్ తర్వాత తెలుస్తుంది.

విజయ్ దేవరకొండకు ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగింది. అతడు తన రెమ్యూనరేషన్ కూడా పెంచాడు. కాబట్టి ఇలాంటి టైమ్ లో ప్రయోగాలు చేయకూడదు. తన నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో సరిగ్గా జడ్జ్ చేయగలగాలి. అందుకే దేవరకొండ కాస్త స్లో అయ్యాడు. ఆచితూచి సినిమాలు సెలక్ట్ చేస్తున్నాడు.