నందిని రెడ్డి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ...?

Wednesday,January 09,2019 - 12:32 by Z_CLU

డియర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. నందిని రెడ్డి దగ్గర కూడా పెద్దగా టైమ్ లేదు, సమంతా తో ‘మిస్ గ్రానీ’ సినిమా పనులతో బిజీ బిజీగా ఉంది. అయితే దొరికిన కాస్త టైమ్ లో ఈ ఇద్దరూ నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఫిల్మ్ నగర్ లో క్రియేట్ అవుతున్న బజ్ ప్రకారం రీసెంట్ గా రచయిత ప్రసన్న కుమార్ ప్రొడ్యూసర్ స్వప్నదత్ కి ఒక స్టోరీ న్యారేట్ చేశాడట. అయితే అదే స్టోరీ నందిని రెడ్డి వరకు వచ్చేసరికి, తను కూడా ఇంప్రెస్ అయిపోయి, దీనికి విజయ్  దేవరకొండ అయితేనే సూటవుతాడు అనే ఒపీనియన్ ని షేర్ చేసుకుందని తెలుస్తుంది.

ఇక అక్కణ్ణించి ప్రసన్న కుమార్ రాసుకున్నఈ కథ విజయ్ వరకు చేరిందా.. లేదా..? దానికి హీరో రియాక్షన్ ఏంటి..? ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే చాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనే డీటేల్స్ తెలియాలంటే, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.