షూటింగ్ లో గాయపడ్డ విజయ్ దేవరకొండ

Monday,December 17,2018 - 01:15 by Z_CLU

సిచ్యువేషన్ ఎలాంటిదైనా డిఫెరెంట్ గా ఆలోచిస్తాడు విజయ్ దేవరకొండ. ఫెయిల్యూర్స్ ని పాజిటివ్ గా ఆక్సెప్ట్ చేస్తాడు.  సోషల్ మీడియా ట్రోల్స్ ని ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు అదే వరసలో గాయాల్ని కూడా ఎంజాయ్ చేయమంటున్నాడు ఈ సెన్సేషనల్ స్టార్. రీసెంట్ గా షూటింగ్ లో గాయపడ్డ విజయ్ దేవరకొండ, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు.

‘లైఫ్ లో ఏదీ ఈజీగా దక్కవు, గాయాలు కూడా. సో గాయాల్ని కూడా ఎంజాయ్ చేయండి..’ అంటూ చేతికి తగిలిన గాయాన్ని చూపిస్తూ  పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ గాయం ఎలా తగిలిందనేది ప్రస్తుతానికి వివరాలు లేకపోయినా, డియర్ కామ్రేడ్ సెట్స్ పై తగిలి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం కాకినాడలో షూటింగ్ జరుపుకుంటుంది డియర్ కామ్రేడ్ టీమ్. ఈ రోజు వాతావరణం సరిగ్గా లేకపోవడంతో, షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్టు మెన్షన్ చేశాడు విజయ్ దేవరకొండ. రష్మిక మండన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. భరత్ కమ్మ ఈ సినిమాకి డైరెక్టర్.