ఆడియన్స్ కు ఫ్రీ ఆఫర్ ఇచ్చిన దేవరకొండ

Monday,November 19,2018 - 05:06 by Z_CLU

విజయ్ దేవరకొండ అంతే. తన మనసుకు నచ్చిన పని వెంటనే చేసేస్తాడు. ఈ హీరో యూత్ కు పిచ్చిపిచ్చిగా కనెక్ట్ అవ్వడానికి ఇది కూడా ఓ కారణం. మరోసారి అలా తన మనసుకు నచ్చిన పని చేసేశాడు విజయ్ దేవరకొండ. టాక్సీవాలా ప్రమోషన్ కోసం ఓ థియేటర్ కు వెళ్లిన హీరో, ఆ థియేటర్ లో సినిమా చూస్తున్న ప్రేక్షకులందరికీ ఇంటర్వెల్ లో ఫ్రీగా స్నాక్స్ ఇచ్చేశాడు.

నిజానికి విజయ్ మైండ్ లో అప్పటివరకు ఈ ఆలోచన లేదు. థియేటర్ లోకి అడుగుపెట్టిన వెంటనే ఈ వెరైటీ ఆలోచన వచ్చిందట. అంతే, వెంటనే అమలుపరిచాడు. నిర్మాతతో మాట్లాడి ప్రేక్షకులందరికీ ఫ్రీగా ఇంటర్వెల్ స్నాక్స్ ఇప్పించేశాడు.

రాబోయే రోజుల్లో తన నుంచి మరో సినిమా థియేటర్లలోకి రావడానికి చాలా టైం పడుతుందని, ఈలోగా తన నుంచి ఇదే చిన్న గిఫ్ట్ అంటూ స్నాక్స్ ఫ్రీగా ఆఫర్ చేశాడు. ప్రస్తుతం ఈ హీరో డియర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు క్రాంతిమాధవ్ డైరక్షన్ లో మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఈ హీరో.