విజయ్ దేవరకొండ "ఫైటర్" లాంఛ్

Monday,January 20,2020 - 11:51 by Z_CLU

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాద్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా రాబోతున్న ఫైటర్ ఈరోజు ఫార్మల్ గా లాంఛ్ అయింది. ముంబయిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. విజయ్ దేవరకొండపై ఫస్ట్ షాట్ తీయగా, నిర్మాత చార్మి క్లాప్ కొట్టారు. ఇవాళ్టి నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను చాలా భారీగా ప్లాన్ చేశారు. యూనిట్ అంతా ముంబయిలోనే దాదాపు 2 నెలల పాటు ఉండబోతోంది. మేజర్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత, నెక్ట్స్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఇలా జస్ట్ 3 షెడ్యూల్స్ లో సినిమా టాకీ పూర్తిచేయాలనేది ప్లాన్.

ఫైటర్ మూవీని పాన్-ఇండియన్ మూవీగా తీస్తున్నారు. పూరి జగన్నాథ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా రాబోతోంది ఫైటర్. సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ తో పాటు హిందీలో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. పూరి జగన్నాద్, చార్మితో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ సినిమాకు నిర్మాతలు.

ఈ మూవీ కోసం దాదాపు 2 నెలలుగా మార్షల్ ఆర్ట్స్ తో ట్రైనింగ్ తీసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఒకేసారి ముగ్గురు ఫారిన్ ట్రయినర్స్, దేవరకొండకు మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రయినింగ్ ఇచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.