ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ
Wednesday,December 05,2018 - 03:48 by Z_CLU
హీరో విజయ్ దేవరకొండ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ఏకంగా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కాడు ఈ హీరో. ఫోర్బ్స్ ప్రకటించిన ఇండియాస్ సెలబ్రిటీస్ టాప్-100లో విజయ్ దేవరకొండ కూడా ఒక్కడు. ఇలా ఫోర్బ్స్ లోకి ఎక్కడం విజయ్ దేవరకొండకు ఇదే ఫస్ట్ టైం.
ఏ ఏడాది సంపాదన, మార్కెట్ వాల్యూ ఆధారంగా ఫోర్బ్స్ సంస్థ ఈ హీరోకు 72వ ర్యాంక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ ఆదాయాన్ని 18 కోట్ల రూపాయలుగా చూపించింది. ఈ ఆదాయ లెక్కలన్నీ అధికారికం.
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో అందర్నీ ఆకర్షించిన విజయ్ దేవరకొండ.. గీతగోవిందం సినిమాతో స్టార్ అయిపోయాడు. టాక్సీవాలా సినిమా అతడి కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలిచింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో విజయ్ దేవరకొండ నేరుగా ఫోర్బ్స్ లిస్ట్ లోకి ఎంటరయ్యాడు.
ఈ ఏడాది లిస్ట్ లో సౌత్ నుంచి రజనీకాంత్ టాప్ లో ఉంటే, సెకెండ్ ప్లేస్ లో పవన్ కల్యాణ్ కొనసాగుతున్నాడు.
హీరో ర్యాంక్ సంపాదన (కోట్లలో)
-
రజనీకాంత్ 14 50
-
పవన్ కల్యాణ్ 24 31.33
-
విజయ్ 26 30.33
-
ఎన్టీఆర్ 28 28
-
విక్రమ్ 29 26
-
మహేష్ బాబు 33 24.33
-
సూర్య 34 23.67
-
విజయ్ సేతుపతి 34 23.67
-
నాగార్జున 36 22.25