విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ అప్డేట్స్

Friday,December 28,2018 - 02:53 by Z_CLU

కాకినాడ షెడ్యూల్ కి సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేసింది ‘డియర్ కామ్రేడ్’ టీమ్. గత నెల రోజులుగా కాకినాడలో రెగ్యులర్ గా జరుపుకుంటున్న ఫిల్మ్ మేకర్స్, ఈ షెడ్యూల్ లో సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

ఈ సినిమాలో సోషల్ రెస్పాన్స్ బిలిటీ ఉన్న మోస్ట్ ఇంటెన్స్ రోల్ లో కనిపించనున్నాడు విజయ్ దేవరకొండ. ‘డియర్ కామ్రేడ్’ స్టోరీలైన్ లాంటివి ప్రస్తుతానికి రివీల్ కాలేదు, కానీ విజయ్ మాత్రం ఈ సినిమా తన కరియర్ లో స్పెషల్ గా నిలిచిపోతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనే ఈ సినిమా ట్యాగ్ లైన్, సినిమాపై ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమాకి భరత్ కమ్మ డైరెక్టర్. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజర్. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘మే’ 2019 లో సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.