ఇద్దరూ ఇద్దరే

Friday,April 17,2020 - 12:47 by Z_CLU

యంగ్ హీరోలిద్దరు బాక్సర్లే

ప్రస్తుతం పూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ముంబైలో కొన్ని బాక్సింగ్ సీన్స్ తీశారు. అయితే అదే బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ కూడా సినిమా చేస్తున్నాడు.

#VT10 సినిమా కూడా పూర్తిగా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. సినిమా కోసం బాక్సింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు వరుణ్.

ఇక విజయ్ మాత్రం సెట్ లోనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నిజానికి రెండు కథలు, కథనాలు వేరైనప్పటికి ఈ ఇద్దరు ఒకే టైంలో సిల్వర్ స్క్రీన్ బాక్సర్లుగా కనిపించడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

రెండు సినిమాలకు సంబంధించి మొదటి షెడ్యుల్స్ పూర్తయ్యాయి. విజయ్ దేవరకొండ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముంబయిలో పూర్తయితే, వరుణ్ తేజ్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ వైజాగ్ లో కంప్లీట్ అయింది.

లాక్ డౌన్ అవ్వగానే విజయ్, వరుణ్ మళ్ళీ బాక్సర్లగా మారబోతున్నారు.