రేపే గీతగోవిందం ప్రీ-లుక్

Wednesday,June 20,2018 - 06:51 by Z_CLU

అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా గీతగోవిందం. పరశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో దేవరకొండ సరసన ‘ఛలో’ ఫేం రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ప్రీ-లుక్ ను రేపు రిలీజ్ చేయబోతున్నారు.

సినిమాకు సంబంధించి టైటిల్ పై మొన్నటివరకు చాలా డౌట్స్ ఉండేవి. వాటిపై ఈరోజు ఓ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. గీతగోవిందం టైటిల్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. అంటే ఈరోజు టైటిల్, రేపు ప్రీ-లుక్ అన్నమాట. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లు అరవింద్ ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ డైరక్టర్. శ్రీరస్తు శుభమస్తు సినిమా తర్వాత పరుశురాం బుజ్జి డైరక్ట్ చేస్తున్న సినిమా ఇదే.